ఉద్యానవన పంటలు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి 

UPDATED 10th AUGUST 2020 MONDAY 7:30 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో ఉద్యానవన పంటలు అభివృద్ధిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ, వాటి అనుబంధ సంస్ధలు, నాబార్డ్  అధికారులతో సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ (ఎఫ్.పీ.ఓ)ల ద్వారా జిల్లాలో రెండు క్లస్టర్లలో వాణిజ్యాభివృధ్ధి చెందేలా పంటలను అభివృధ్ధి పరిచే నివేదికలు సిధ్ధం చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 30 వేల ఎకరాల్లో 12 వేల మంది ఆర్ఓఎఫ్ఆర్ క్రింద పట్టాలు అక్టోబర్ నెల రెండవ  తేదీన అందిస్తున్న నేపధ్యంలో వీరిని ఎఫ్.పి.ఓ.లుగా ఏర్పాటు చేసి ఉద్యావన పంటలు అభివృధ్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. అలాగే మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, ఆక్వా ఏదో ఒక రంగంలో ఎఫ్.పి.ఓల ద్వారా ఒక పంటను గుర్తించి దీనిని వాణిజ్యపరంగా అభివృధ్ధిపరిచే విధంగా పూర్తి నివేదికను వారంలోగా అందించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎఫ్.పి.ఓల ద్వారా చేపట్టే అభివృధ్ధి పనులను ఉపాధి హామీ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన శాఖాధికారులు సమన్వయం చేసుకుని, భూ అభివృధ్ధి పనులతో పాటు మార్కెటింగ్ తదితర అంశాలపై నివేదికలు తయారు చేయాలని, ఈ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి తగు ఆమోదం వచ్చిన తరువాత కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేలా అధికారులు సిధ్ధంగా ఉండాలని ఆయన అన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us