UPDATED 11th JULY 2022 MONDAY 5:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం ఆర్డీవో కార్యాలయ ఏవోగా వై. సరస్వతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జగ్గంపేట తహశీల్దార్ గా పనిచేస్తూ బదిలీపై ఆమె ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఏవోగా ఇక్కడ పనిచేసిన రవీంద్ర పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఈమె ఇక్కడకు వచ్చారు. అలాగే ఆర్డీవో కార్యాలయ డీటీ (కేఆర్సీ)గా భానుకుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకూ డీటీగా పనిచేసిన రామ్ కుమార్ పెదపూడి డీటీగా బదిలీ అయ్యారు.







