UPDATED 5th OCTOBER 2017 THURSDAY 6:00 PM
గండేపల్లి; తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 6 వ తేదీన హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కంపెనీ "కంట్రోల్ ఎస్" క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ లో 20 వేలు లోపు ర్యాంక్/ఈసెట్ మూడు వేలు లోపు ర్యాంక్ సాధించి, 75 శాతం మార్కులతో ఎటువంటి బ్యాక్ లాగ్స్ లేని బిటెక్ ఈసీఈ, సీఈసీ, ఐటి (2017-18) పాస్ అవుట్ స్టూడెంట్స్ అర్హులని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష, సాంకేతిక, హెచ్ ఆర్ ఇంటర్వ్యూ ల ద్వారా జరుగుతుందని, ఎంపికైనవారు హైదరాబాద్ లో గ్రాడ్యుయేట్ ట్రైనీ గా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు లక్షలు నుంచి 3.30 లక్షలు వార్షిక వేతనం లభిస్తుందని, అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.







