వైద్యులపై దాడులు హేయమైన చర్య

UPDATED 17th JUNE 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: ప్రాణాపాయం నుంచి రక్షించే వైద్యులపై దాడులు చేయడం హేయమైన చర్యని పెద్దాపురం  ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికాంత్ అన్నారు. కోల్‌కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడులను నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సోమవారం ఆందోళన చేపట్టారు. ‘వైద్యులకు రక్షణ కల్పించాలి.. దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, వైద్యుల మనోభావాలు కాపాడుతూ వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఏ వైద్యుడైనా రోగిని రక్షించాలని చూస్తాడే తప్ప మరణించాలని కోరుకోరని పేర్కొన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి చికిత్స అందించాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, జాతీయస్థాయిలో రక్షణ చట్టాలను ప్రవేశపెట్టినపుడే ఈ స్థితిలో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. వైద్యులపై దాడి చేసిన నిందితులను గుర్తించి వెంటనే వారిని అరెస్టు చేసి శిక్షించాలని ఆయన పేర్కొన్నారు.
    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us