పాఠశాల విద్యార్థులకు కంప్యూటరుపై అవగాహన

UPDATED 9th AUGUST 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఐ.ఎస్.టి.ఇ  విద్యార్థుల బృందం పెద్దాపురం మండల పరిధిలో గల వడ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇంటర్నెట్ ఉపయోగాలు, కంప్యూటర్ పనితీరు, ప్రాధమిక పరిజ్ఞానం, కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి విద్యార్థులకు  అవగాహన కల్పించినట్లు కళాశాల ఐ.ఎస్.టి.ఇ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ బి. మాణిక్యాలరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుందని  పాఠశాల హెచ్ఎం వై. నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ పాలచర్ల బుజ్జి, తదితరులు పాల్గొన్నారు. ఐ.ఎస్.టి.ఇ విద్యార్థి విభాగం సభ్యులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  టి.కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ తదితరులు అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us