ఆదిత్య కళాశాలలో ఈసీఈ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్

UPDATED 10th JULY 2017 MONDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగానికి చెందిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ( హైదరాబాద్ ) కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ సిగ్నల్ అండ్ సిస్టమ్స్ అనే అంశం పై గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు విద్యార్థులకు తెలియచేశారు. అలాగే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సోదాహరణలతో ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే సిగ్నల్ అండ్ సిస్టమ్స్ అనే అంశంలో కీలకమైన విషయాలను విద్యార్థులకు తెలియచేశారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్  నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సమున్నత అభివృద్ధే ఆదిత్య విద్యా సంస్థల లక్ష్యమని అన్నారు. తమ కళాశాల విద్యార్థులకు ఇలాంటి సెమినార్లు ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఈసీఈ విభాగాధిపతి  రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us