UPDATED 5th JULY 2019 FRIDAY 6:00 PM
పెద్దాపురం: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మరిడమ్మ అమ్మవారిని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేద పండితులు చిట్టెం హరిగోపాల శర్మ, ప్రసాదశర్మ ఆలయ మర్యాదల ప్రకారం వారికి ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలోని మూల విరాట్టును వారు దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్, వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. అలాగే అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఏసీబీ డీఎస్పీ ఎం. సుధాకర్ దంపతులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, తదితరులు పాల్గొన్నారు.







