మాదక ద్రవ్యాల వ్యసనం, నివారణా చర్యలపై అవగాహనా సదస్సు

UPDATED 5th MARCH 2020 THURSDAY 7:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, ఆల్ ఈజ్ వెల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సూరంపాలెం గ్రామంలో మాదక ద్రవ్యాల వ్యసనం, నివారణా చర్యలపై గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (కాకినాడ) అసిస్టెంట్ ప్రొఫెసర్ సైక్రియాట్రీ డాక్టర్ వర ప్రసాద్, ఆల్ ఈజ్ వెల్ సొసైటీ అధ్యక్షులు కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు డాక్టర్ వర ప్రసాద్ మాదక ద్రవ్యాల వ్యసనం, వాటి నివారణా చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి. రాజశేఖర ఫణీంద్ర, బి. సుధీర్, విద్యార్థులు ప్రమోద్, శశాంక్, చైతన్య, సూర్యనారాయణ, ముఖేష్ రెడ్డి, జ్యోతిర్మయి, స్నేహ, 50 మంది విద్యార్ధి వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us