గణతంత్ర దినోత్సవానికి గణిత చదరంతో స్వాగతం

UPDATED 25th JANUARY 2021 MONDAY 7:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని తోటకూర హేమమణి వర్షిత వినూత్నంగా గణిత చదరం రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎటుకూడినా 72 వచ్చే విధంగా మాయా చదరం రూపొందించడం ద్వారా గణితం పట్ల తనకు గల మక్కువను చాటుతూ అధ్యాపకులు, మిత్రుల అభినందనలు అందుకున్నారు. అడ్డు వరుసల మొత్తం, నిలువు వరుసలు మొత్తం, కర్ణాల మొత్తం, ఒకే రంగులో ఉన్న సంఖ్యల మొత్తం ఇలా ఎటు కూడినా, ఏ నాలుగు సంఖ్యలను కూడినా మొత్తం 72 వచ్చే విధంగా మేజిక్ స్క్వేర్ రూపొందించడం విశేషం. బాల్యం నుంచి జాతీయ పర్వదినాలు, ప్రముఖులు, జాతీయ నాయకుల పుట్టిన రోజున ఈ విధంగా గణిత చదరాలను రూపొందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణితం పట్ల తన ఆసక్తిని, అభిమానాన్ని చాటుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు ఆమెను అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us