గైట్ లో డబ్యువైసిఎం అవగాహనా సదస్సు

UPDATED 30th OCTOBER 2018 TUESDAY 5:30 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ యూత్ ఛేంజ్ మేకర్స్ ది న్యూ డెస్టినీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్యువైసిఎం ఫాకల్టీ సభ్యుడు సునీల్ మాట్లాడుతూ జీవితాన్ని మలుచుకోవడం మన చేతుల్లో ఉందని, విజయాన్ని సాధించాలన్న సంకల్పంతో పాటు అందుకు అవసరమైన మార్గాలను ఆచరించాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉంటే ప్రపంచమంతా సంతోషం నిండి ఉంటుందని అన్నారు. యువతను గొప్ప నాయకులుగా తయారు చేయాలన్నకృత నిశ్చయంతో ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ఓ&ఓ అకాడమీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని, ఈ అకాడమీకి చెందిన ప్రాథమిక సూత్రాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీలావతి, హెచ్.బి.ఎస్ విభాగాధిపతి డాక్టర్ వి. కుసుమకుమారి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.డి. శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.      

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us