UPDATED 16th MARCH 2018 FRIDAY 6:30 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండలంలోని కొత్త తుంగపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా రెండవరోజైన శుక్రవారం మరుగుదొడ్లు నిర్మాణం, ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ ఆవశ్యకత, బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.







