ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు

UPDATED 5th DECEMBER 2019 THURSDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రైతులు ప్రకృతి వ్యవసాయ విధానం అవలంభిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని కాకినాడ వ్యవసాయ శాఖ ఎడి జివి పద్మశ్రీ అన్నారు. మండల పరిధిలోని గొంచాల గ్రామంలో రైతు పేర్నిడి సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభించి సాగు చేసిన పొలంలో పంటకోత ప్రయోగాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ పద్మశ్రీ మాట్లాడుతూ రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూమి కాలుష్యమై పోతుందని, ప్రకృతి వ్యవసాయం అవలంభించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఇందులో జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం వంటి వాటిని ప్రకృతి వ్యవసాయ విధానంలో అవలంభించాలని, సాగుకు నీరు తక్కువగా ఉన్నప్పటికీ సరిపోతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంతో పెట్టుబడులు తగ్గి లాభాలు ఆర్జించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి ఐ. సత్య, ఏఈవో ఎం.వి. సతీష్, జెబిఎన్ఎఫ్ సిబ్బంది కె. మహేశ్వరరావు, డి హనుమంతరావు, బి. రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us