UPDATED 8th OCTOBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: దక్షిణ భారత హిందీ ప్రచార సభ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన హిందీ క్విజ్ పోటీలలో స్థానిక అయోధ్యరామపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో విద్యార్థి వి. సంతోష్ ప్రథమ స్థానం, ఎం.వి.వి. దుర్గాగణేష్ తృతీయ స్థానం సాధించారని, అలాగే డిబేట్ లో పరాష్ కుమారి తృతీయ బహుమతి సాధించినట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. విద్యార్థులను అభినందిస్తూ హిందీ అధ్యాపకురాలు లక్ష్మి వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేశారు. రాష్ట్రస్థాయిలో బహుమతి సాధించి పాఠశాలకు ఘనత తీసుకువచ్చిన విద్యార్థులను హిందీ అధ్యాపకురాలు పి.ఎస్. లక్ష్మి, హెచ్ఎం సాయిరామకృష్ణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.







