UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 10:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసివున్న నూకాలమ్మ అమ్మవారి తొలి గరగల ఉత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మీ నాని, ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి గరగల ఉత్సవాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్ర ప్రకాష్, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు సావిటి నాగేశ్వరరావు, బొజ్జ వెంకట్రాజు, గవరసాన వెంకట్రాజు, ఉద్దగిరి అర్జున్, అరట్ల బుల్లబ్బాయి, మింగి వీరబాబు, రంగనాధం శ్రీను, గుద్దటి ధర్మరాజు, వేమవరపు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది పుర్రె అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.







