UPDATED 5th MARCH 2018 MONDAY 7:30 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో ఎంసిఎ విద్యార్థులకు పైథాన్ వర్క్ షాప్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంసిఎ విభాగాధిపతి తమిళ్ కోడి మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను ఎంసిఎ విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఎ.పి.ఎస్. ఎస్.డి.సి మద్దతుతో ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ శిక్షణలో 60 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈనెల10వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఈ వర్క్ షాపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎ.పి.ఎస్.ఎస్.డి.సి కేటాయించిన ట్రైనీలు డి. రమ్య, ఎస్. సత్య పర్యవేక్షణలో వర్క్ షాపు జరుగుతుందని విభాగాధిపతి తమిళ్ కోడి తెలిపారు.







