UPDATED 5th JULY 2018 THURSDAY 8:30 PM
పెద్దాపురం : పెద్దాపురం డివిజన్ పంచాయతీ అధికారిగా సి.హెచ్. నర్సారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కాజులూరు ఎంపిడివోగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఇంతవరకు డిఎల్పీవోగా పనిచేసిన నాగలత పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆమె తరువాత ఇంచార్జ్ గా రాజమహేంద్రవరం డిఎల్పీవో వరప్రసాద్ వ్యవహరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నర్సారావు గతంలో పెద్దాపురంలో ఈవోపిఆర్డీగా పనిచే శారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎల్పీవోను పంచాయతీ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.







