భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం వేడుకలు

* వేడుకల్లో పాల్గొన్న జర్మనీ దేశస్థులు
UPDATED 3rd SEPTEMBER 2017 SUNDAY 8:00 PM
గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో కొలువుతీరిన గణనాథుడిని నవరాత్రి పూజలు అనంతరం ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, జర్మనీకి చెందిన స్టీమ్ బీజ్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ బెర్ట్ రామ్, లోహా ముల్లర్, వంగపండు వెంకట నాగరాజు హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి సంబంధమైన పవిత్ర పండుగ వినాయక చవితిని మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం జర్మనీ ప్రతినిధులు ఈ వేడుకలను ఆసక్తిగా తిలకించి చవితి విశిష్ఠతను నిమజ్జనం వేడుకలు ఔనత్యాన్ని అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం వేడుకల్లో పాల్గొనడం తమ అదృష్టంగా   భావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా నడుమ రంగులు చల్లుకుంటూ సామర్లకోట గోదావరి కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె.రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 
       
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us