UPDATED 1st JULY 2018 SUNDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ఆధ్వర్యంలో వనమహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు జరుపుకునే వనమహోత్సవ వారోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పంచాయతీ భవనం, పశువుల ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్ తదితర పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. చెట్లను నాటండి....చెట్లను రక్షించండి అనే నినాదంతో గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ కార్యక్రమం అధికారులు టి. ప్రవీణ్, ఎం. గోవర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. మోహన్, డి. ఆస్తాశర్మ, పాఠశాల హెచ్ఎం సి.హెచ్. నాగభూషణం, గ్రామ సర్పంచ్ సింగన అరవిందకుమార్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.







