UPDATED 16 APRIL 2020 WEDNESDAY 2.30 PM
ప్రస్తుతం సోషల్ మీడియా హవా బాగా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అలాగే అధికంగా సోషల్ మీడియాలో సమయాన్ని గడిపేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాం ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది. అనేక మంది సెలబ్రిటీలు కూడా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కలిగి ఉన్నారు. తెలుగు హీరోల్లో ప్రభాస్ ఇన్‌స్టాగ్రాంలో హల్‌చల్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో అత్యధిక సార్లు ప్రస్తావన పొందిన తెలుగు హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రభాస్ పేరును ట్యాగ్ చేస్తూ పది లక్షలకు పైగా పోస్టులు ప్రచురితం అయ్యాయట. ఇక, ప్రభాస్ తర్వాతి స్థానంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. విజయ్ పేరును ప్రస్తావిస్తూ దాదాపు 9 లక్షలకు పైగా పోస్టులు పడ్డాయట. ఇక, నాని, అల్లు అర్జున్ మొదలయినవారిని ట్యాగ్ చేస్తూ 8 లక్షలు, సూపర్‌స్టార్ మహేష్‌బాబును ప్రస్తావిస్తూ ఏడు లక్షలకుపైగా పోస్టులు ప్రచురితం అయ్యాయట.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







