తెరుచుకున్న ఆలయాలు

సామర్లకోట:8 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రెండున్నర నెలల సుదీర్ఘ విరామం అనంతరం దేవాలయాల సోమవారం తెరుచుకున్నాయి. ముఖ్య పుణ్యక్షేత్రాలలో పాటు అన్ని ప్రసిద్ధ దేవాలయాలు తెరుచుకోగా నిబంధనల ప్రకారం భక్తులు భగవంతుడిని దర్శించుకున్నారు. దర్శనానికి పడిన సమయం కన్నా ఆలయంలోపకి ప్రవేశించేందుకు దేవాదాయ అధికారులు చేసిన చర్యలకు అధిక సమయం పట్టడంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. అయినా దానిని భరిస్తూ దర్శనాలు చేసుకుని తరించారు. పంచారామ క్షేత్ర మైన కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 6:30 నిమిషాలకు ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయాన్ని తెరిచారు. ప్రాతఃకాలంలో శివుని దర్శనం కోసం భక్తులు పలువురు ఆలయం వద్దకు చేరుకొని వేచి ఉండగా, వారికి ముందుగా ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సంబంధించి ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్లు వారి చిరునామాలు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఆలయ సీనియర్ అసిస్టెంట్ భద్రరావు నిర్వహించారు. అనంతరం భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ దర్శనానికి దేవాదాయ అధికారులు ఏర్పాటు చేసిన సర్కిళ్లలో వెళ్లి దర్శనాలను కొనసాగించారు. కాగా శివుని గర్భాలయంలో మాత్రం భౌతిక దూరం పాటిస్తూ ఆరడుగుల దూరం పాటించే విధంగా ఒక్కొక్కరిని మాత్రమే గర్భాలయం వెలుపల నుంచి దర్శనాలను చేసుకునేందుకు అనుమతించారు. 60ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు వయసుగల వారిని అనుమతించకుండా సిబ్బంది జాగ్రత్త వహించారు. అలాగే ఆలయాల్లో దేవతల విగ్రహాలు ప్రధానమైన శిల్పాలు కట్టడాలు భక్తులు ఏమాత్రం ముట్టుకోకుండా భక్తులు విధిగా మాస్కూలు ధరించచి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సామర్లకోట పట్టణంలో ప్రధానంగా భీమేశ్వరాలయంతో పాటు అతి పురాతన దేవాలయమైన మాండవ్య నారాయణ స్వామి ఆలయంలోనూ హరిహర క్షేత్రంలోను సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నిబంధనలు పాటిస్తూ దర్శనాలనుకొనసాగించారు. కాగా భక్తులకు భద్రతకు శానిటేషన్ పాటించే విధంగా ఆలయ అధికారులు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి సేవలందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us