మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

UPDATED 9th AUGUST 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్, లెప్రసీ కంట్రోల్ అధికారి డాక్టర్ మోకా పవన్ కుమార్ అన్నారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పీతల చంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, పౌష్ఠికాహారం పంపిణీ చేశారు. అలాగే హైరిస్క్ గర్భిణీలకు గుర్తించి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి, ఆస్పత్రి సిబ్బంది ఏసుదాసు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us