జనవరిలో జేఎన్టీయూకే స్నాతకోత్సవం

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: కాకినాడ జేఎన్టీయూకే 8వ స్నాతకోత్సవాన్ని జనవరిలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు. 2018-19, 2019-20 విద్యా సంవత్సరాలకు సంబంధించిన స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులు స్నాతకోత్సవ తేదీ, నిర్వహించే ప్రదేశము, బంగారుపతకాల వివరాలు అదే విధంగా ఫీజు తదితర వివరాలను ఠీఠీఠీ.్జుఽ్టఠజు.్ఛఛీఠ.జీుఽ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో పైన సూచించిన వెబ్‌లింక్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 2018-19 విద్యాసంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉంటే మరలా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకోలేదో వారంతా ఆన్‌లైన్‌లో డిసెంబరు 4లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us