రామానుజన్ కు గణిత చదరంతో శుభాకాంక్షలు

UPDATED 21st DECEMBER 2020 MONDAY 5:30 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా సామర్లకోట పట్టణానికి చెందిన భారత బాల భూషణ్ అవార్డు గ్రహీత, బాల గణితావధాని తోటకూర సాయివంశీ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఈనెల 22న గణిత మేధావి రామానుజన్ 133వ జయంతి పురస్కరించుకొని ఎటుకూడినా 133 వచ్చే విధంగా గణిత చదరం రూపొందించి రామానుజన్ పట్ల తనకున్న అభిమానం చాటుకున్నాడు. అడ్డు వరుసలు  మొత్తం, నిలువు వరుసలు మొత్తం, కర్ణాల మొత్తం ఇలా ఎటుకూడినా ఆ సంఖ్యల మొత్తం 133 వచ్చే విధంగా తయారు చేయడం ఇందులో విశేషం. ఆదిత్య విద్యా సంస్థలో ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వంశీ జాతీయ పర్వదినాలు, ప్రముఖుల పుట్టిన రోజున ఈ విధంగా గణిత చదరాలను రూపొందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన గణిత అభిమానాన్ని చాటుతూ ఉంటాడు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us