విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

UPDATED 25th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ పరిధిలోని స్థానిక అయోధ్యరామపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ కమిటీ చైర్మన్ సప్పా గంగాభవాని, హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం దృష్ట్యా  ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పాఠ్యపుస్తకాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలనీ, ఈ సంవత్సరం విద్యార్థి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్ లను ముద్రించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కె. అరుణ, ఎ.ఎల్.వి. కుమారి, ఎ.పి. రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us