ఆదిత్యలో మహిళా హక్కుల అవగాహనపై పోటీలు

UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదిత్య గ్రంధాలయ విభాగం  ఆధ్వర్యంలో జాతీయ మహిళా కమీషన్ ఉత్తర్వులు మేరకు జాతీయ మహిళా హక్కుల పరిరక్షణ అనే అంశంపై విద్యార్దులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులు మహిళా హక్కులు గురించి మట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్త్రీలు తన మనుగడ కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నారని, శారీరకపరమైన బలహీనతల చేత పురుషాధిక్యత గల సమాజంలో వెనుకబాటుతనాన్ని విడలేకపోతున్నారని అన్నారు. అన్ని రంగాలలో పురుషుల కంటే మిన్నగా విజయాలు సాధిస్తున్నప్పటికీ, స్త్రీల పట్ల అరాచకాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 70 సంవత్సరాల భారతావనిలో స్త్రీలు అనేక భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో చట్టాలు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ప్రధానాధికారి కె. అశోక్ కుమార్, గ్రంధాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us