UPDATED 3rd MARCH 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. పట్టణ పరిధిలోని 7,8 వార్డుల్లో ఆదివారం రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి పార్టీ అధినేత రూపొందించిన నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజేష్, దవులూరి సుబ్బారావు, శెట్టిబత్తుల దుర్గారావు, కంటే వీర్రాఘవరావు, ఎస్. సత్తిబాబు, ఇరుసుమళ్ళ సాయి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, సేపేని సురేష్, మేడిశెట్టి వీరభద్రం, ఇనకొండ విష్ణుచక్రం, బండారు వీరబాబు, డేగల వెంకన్న, భాస్కరవు, చింతల బాబురావు, పితాని కృష్ణ, గోపు నారాయణమూర్తి, సిద్దిరెడ్డి సూరిబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







