UPDATED 29th JULY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భవిత కేంద్రాల ద్వారా అందిస్తున్న ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య, సర్వశిక్షా అభియాన్ కమ్యూనిటీ మోబలైజేషన్ ఆఫీసర్ (సిఎంఒ) ఇంటి వెంకట్రావు అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సేవలను సిఎంఒ ఇంటి వెంకట్రావు, మండల విద్యాశాఖాధికారి శివరామకృష్ణయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిజియోథెరపీ అవసరమైన పిల్లలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని, ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేయించాలని సూచించారు. ఫిజియోథెరపి ద్వారా అభివృద్ధి చెందిన పిల్లలను మిగతా తల్లిదండ్రులకు చూపించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జోసఫ్ రాజు, భవిత సిబ్బంది అనిత. పద్మ, తదితరులు పాల్గొన్నారు.







