UPDATED 11th SEPTEMBER 2017 MONDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు కాకినాడలో ఉన్న ఆనందనిలయంలో అనాథ బాలలకు వితరణ చేశారు. ఈ సందర్భంగా కళాశాల మెంటార్ శైలజారావు మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచే నీతి, నిజాయితీతో పాటు సేవాగుణాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా స్వచ్చంధ సంస్థకు అవసరమైన సీలింగ్ ఫ్యాన్లు, అలాగే విద్యార్థులకు స్వీట్లు మొదలైనవి అందచేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.







