ఆగి ఉన్న లారీ ఢీకొని యువకుడు మృతి

UPDATED 25th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొని బుధవారం యువకుడు మృతి చెందాడు. సామర్లకోట ఎస్సై సుమంత్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఉప్పు వారి వీధి రామాలయం వీధికి చెందిన గుడుపు పశువులరావు (24) స్థానిక ఐఎంఎల్ డిపోలో పని చేస్తున్నాడని, డిపో వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడన్నారు. లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలుపుదల చేయడంతో ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us