29న ఉభయగోదావరి జిల్లాల ఐఏబీ సమావేశం

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ధవళేశ్వరంలోని జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉభయ గోదావరి జిల్లాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (IAB) సమావేశాన్ని ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలోని వివేకానంద హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో నీటి లభ్యత, సాగు ఆయకట్టుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. అనంతరం ఆయన్ని జలవనరుల శాఖ అధికారులు సత్కరించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us