UPDATED 19th JULY 2019 FRIDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల అంతర్గత నాణ్యతా భరోసా విభాగం ఆధ్వర్యంలో రోల్ ఆఫ్ ఐపిఆర్ ఇన్ ఇన్నోవేషన్ మేనేజ్ మెంట్ అండ్ ఇండస్ట్రీ అకాడెమియా కొలాబరేషన్ అనే అంశంపై కార్యశాల నిర్వహించినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్&డి డైరెక్టర్ డాక్టర్ కెవిఎస్ రామచంద్రమూర్తి సంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి నేషనల్ రీసెర్చ్ డవలప్ మెంట్ కార్పోరేషన్ రీజనల్ మేనేజర్ డాక్టర్ బి.కె.సాహు, నోవెల్ పేటెంట్ సర్వీసెస్ డైరెక్టర్ పట్టాభి మురళీకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్&డి డైరెక్టర్ డాక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆదిత్య ఇంజనీరింగ్ విద్యా సంస్థల ప్రాంగణంలో 70మందికి పైగా పి.హెచ్.డి పట్టభద్రులతో, 15మంది థీసిస్ సమర్పించి, 60 మంది అధ్యాపకులు పి.హెచ్.డి కోసం రిజిస్టర్ అయి పరిశోధనలు చేస్తూ ఆదిత్య క్యాంపస్ ఒక పెద్ద విజ్ఞాన కేంద్రంగా అవతరించిందని తెలిపారు. అంతర్గత నాణ్యతా భరోసా విభాగం కళాశాల సమగ్ర అభివృద్ధికి దిశానిర్ధేశం చేస్తూ కార్యశాలలు, సమావేశాలు నిర్వహించడం, సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి కృషి చేయడం, నాణ్యతపై అవగాహన కల్పిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ మూర్తి తెలిపారు. బి.కె.దాస్ మాట్లాడుతూ ప్రతి సంస్థ ఒక ఐపిఆర్ పాలసీ తయారు చేసుకోవాలని తెలిపారు. దేశ పురోభివృద్ధికి, ఆర్ధిక స్వావలంబనకు పరిశోధనలు చేయడం, పరిశోధనలపై హక్కులను పరిరక్షించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. మురళీకృష్ణ మాట్లాడుతూ పేటెంట్ ఎలా ఫైల్ చెయ్యాలి, ఎలాంటి పరిశోధనలపై పేటెంట్ గ్రాంట్ అవుతుంది, విద్యాసంస్థలు చేసే పరిశోధనలపై హక్కులు పరిరక్షణ, ప్రాధాన్యతలను వివరించారు. మన దేశంలో పరిశోధనల ద్వారా వచ్చే నూతన ఉత్పత్తులు, వాటిని తయారు చేసే పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విద్యాసంస్థలు పరిశ్రమలతో కలిసి సంయుక్తంగా పని చేయాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఏ. రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







