UPDATED 11th JULY 2019 THURSDAY 8:00 PM
పెద్దాపురం: పెద్దాపురం ఎంపీడీవోగా అబ్బిరెడ్డి రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. ఇంతవరకూ ఇక్కడ ఎంపీడీవోగా విధులు నిర్వర్తించిన పిడుగు ఉమామహేశ్వరరావు విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. గతంలో తొండంగి, అనపర్తి, కాకినాడ రూరల్, రామచంద్రపురం, రాజమహేంద్రరం రూరల్, సామర్లకోట ఈటీసీలో ఎంపీడీవోగా రమణారెడ్డి పనిచేశారు. ఎంపీడీవోగా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, కార్యాలయ సూపరింటెండెంట్ విప్పర్తి సాయిబాబా, ఉపాధి హామీ ఏపీవో రాయి ప్రభాకరరావు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఎంపీడీవోను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.







