ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022: పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ నుంచి అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి.. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రధానమంత్రి పర్యటనలో బయటపడిన భారీ భద్రతా వైఫల్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు.







