UPDATED 13th OCTOBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: అనపర్తి రైల్వే స్టేషన్ ఒకటో నెంబరు ప్లాటుఫారం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సామర్లకోట రైల్వే హెడ్ కానిస్టేబుల్ జె. గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.







