రెడ్ బీ న్యూస్, 3 జనవరి 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త.. దేవాదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
★ మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
★ దరఖాస్తుకు చివరి తేది : 2022 జనవరి 19
★ ఇందులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
★ విద్యార్హతకు సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
★ వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
★ ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి.
★ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు
https://psc.ap.gov.in వెబ్ సైట్ ను చూడొచ్చు.







