UPDATED 9th JUNE 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: గర్భిణీలు తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పి. చంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెలా గర్భిణీలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, తల్లీ బిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







