సామర్లకోటలో భారీ అగ్నిప్రమాదం

* రూ. ఆరు లక్షలు ఆస్తి నష్టం
* అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ

UPDATED 30th DECEMBER 2019 MONDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణంలోని స్థానిక రజకుల వీధిలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్ళు, గడ్డివాము, పశువుల పాక దగ్ధమై సుమారు రూ. ఆరు లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో అడపా వెంకటలక్ష్మి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించగా ఇంట్లో వారు కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. మంటలు భారీగా వ్యాపించడంతో పక్కనే ఉన్న సుకపట్ల అప్పలరాజు ఇల్లుతో పాటు వెదుళ్ల సూరిబాబుకు చెందిన గడ్డివాము, పశువుల పాక దగ్ధం అయ్యాయి. అగ్నిప్రమాద సమయంలో రెండు ఇళ్ళలో ఉన్న గ్యాస్ సిలెండర్లు ఒక్కసారిగా పేలడంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాద జరిగిన వెంటనే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు బాధిత కుటుంబాలను పరామర్శించి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను భారతమాత సేవ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర పరామర్శించి బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం అగ్నిమాపకాధికారి బంగారపు ఏసుబాబు, సిబ్బంది ఎం.ఆర్.కె. దొర, ఎల్.వి. భాస్కరరావు, దివాకర్, ప్రసాద్, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్,  దవులూరి సుబ్బారావు, ఇరుసుమళ్ళ సాయి, ఆవాల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.   
      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us