UPDATED 1st OCTOBER 2018 MONDAY 7:00 PM
పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో భూసమస్యలు నిమిత్తం ఐదు అర్జీలు, ఆన్ లైన్ లో భూమి నమోదు నిమిత్తం ఒకటి, ఇనాం భూమి కోసం ఒకటి, హౌసింగ్ సంబందించి పెండింగు బిల్లు ఇప్పించమని ఒకటి, వాలుతిమ్మాపురంలో మద్యాన్ని నిషేధించాలని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.







