పారిశుధ్యలోపంతో అంటురోగాలు

UPDATED 9th OCTOBER 2018 TUESDAY 6:00 PM

పెద్దాపురం: పారిశుధ్య లోపంతో ప్రజలు అంటురోగాల బారినపడే అవకాశం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. పట్టణ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్యం డ్రైవ్ ను మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రితో కలిసి ఆర్డీవో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న చెత్తను తొలగించి బ్లీచింగ్ చల్లించారు. అనంతరం ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పారిశుధ్యానికి ఎలాంటి లోపం లేకుండా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వారివద్ద ఉన్న చెత్తను మున్సిపల్  వాహనం వచ్చినపుడు వారికి అందచేయాలే తప్ప రోడ్డు మీద వేయరాదని, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాల కేసులు ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదు అవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విష జ్వరాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారని, సంచార వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తదితరులు ఉన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us