పోలీస్ శాఖ కార్తీక వన సమారాధన

UPDATED 17th NOVEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక విడివో సెంటరులో పోలీసుశాఖ శనివారం నిర్వహించిన కార్తీక వన సమారాధనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పాల్గొన్నారు. ముందుగా వెంకటేశ్వరస్వామి ఆలయంలోని ఉసిరిచెట్టుకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి మంత్రి, ఎస్పీ భోజనం వడ్డించిన అనంతరం వారితో కలిసి సామూహిక భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, డిఎస్పీ చిలకా వెంకట రామారావు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us