UPDATED 3rd JANUARY 2020 FRIDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్)లో మెకానికల్ విభాగం అధ్వర్యంలో అడ్వాన్స్ ఇన్ హీట్ ట్రాన్స్ ఫర్ అనే అంశంపై ఒకరోజు గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విట్ యూనివర్సటీ(చెన్నై) కి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కె. కరుణామూర్తి హాజరయ్యారు. మెకానికల్ లో కీలక అంశాలైన హీట్ ట్రాన్స్ఫర్, అడ్వాన్స్ టెక్నాలజీ గురించి పరిశోధనాత్మకంగా విద్యార్థులకు వివరించినట్లు డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.హెచ్. వరప్రసాద్ మాట్లాడుతూ తృతీయ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని, బేసిక్ అంశాలపై అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ. శరవణన్, డాక్టర్ ఏ. ప్రీతం కుమార్ దాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏ. శిరీష, సీతారాం, రాజా, తదితర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







