UPDATED 22nd AUGUST 2018 WEDNESDAY 6:00 PM
రంపచోడవరం: మూడు, నాలుగు, ఐదు సెక్టార్ల పరిధిలోని గోదావరి నది వరద ప్రభావిత గ్రామాలకు అదనంగా అరలీటరు కిరోసిన్ ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎపివో పి.వి.ఎస్ నాయుడు అన్నారు. స్థానిక ఐటిడిఎ వద్ద నుంచి కిరోసిన్ వాహనాన్ని ముంపు గ్రామాలకు బుధవారం పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి డిఎం రాజన్ రాజు, ఎపిడి వెలుగు వై. సత్యం నాయుడు, ఎపివో రమేష్, తదితరులు పాల్గొన్నారు.







