ఫిబ్రవరి 8న జాతీయ లోక్ అదాలత్

UPDATED 31st JANUARY 2020 FRIDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో అధిక శాతం కేసులు పరిష్కరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏడవ అదనపు జిల్లా జడ్జి ఆర్.జె. విశ్వనాధం తెలిపారు. స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో గల బార్ అసోసియేషన్ భవనంలో పెద్దాపురం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ అధ్యక్షతన పోలీస్, ఎక్సయిజ్, తదితర శాఖల అధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి ఆర్.జె. విశ్వనాధం పాల్గొని మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో రాజీకి యోగ్యమైన అన్ని కేసులు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కక్షిదారులు సంతోషంతో జీవించేలా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. న్యాయవాదులు కక్షిదారులకు జాతీయ లోక్ అదాలత్ ఆవశ్యకతను తెలియజేసి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా వారికి అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి సి.హెచ్. సునందమ్మ, అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జోష్ణాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం (మణి), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గన్నంరాజు సత్యనారాయణ, ఏపీపీలు వేమన అశోక్ కుమార్, ఎన్.వి.ఎస్. మూర్తి (బాలు), పారా లీగల్ వాలంటీర్లు, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు, ఎక్సయిజ్, పోలీసు అధికారులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us