UPDATED 26th JULY 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం: ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని కళాశాల సెమినార్ హల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ ఎ. రమేష్ హాజరై కార్గిల్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా ఎటువంటి భయం లేకుండా జీవిస్తున్నామంటే అది ఎంతోమంది సైనికుల త్యాగఫలమని, ప్రతీ ఒక్కరూ దేశభక్తి కలిగి ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాతృభూమిలోకి చొరబడిన ముష్కరులపై భారత జవాన్లు 60 రోజుల పాటు పోరాటం సాగించి దేశానికి విజయాన్ని అందించారని, అదే కార్గిల్ యుద్ధం అన్నారు. వందల మంది సైనికుల ప్రాణత్యాగ ఫలం నేడు జులై 26.. కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకొంటున్నాం అన్నారు. భరతమాత నిజమైన ముద్దుబిడ్డలకు ఆదిత్య సలాం చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అమరవీరుల జీవిత చరిత్రపై అవగాహన సదస్సు, క్విజ్, వ్యక్తిత్వ వికాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాలమోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







