దేశ సమగ్రత, క్రమశిక్షణకు ఎన్.సి.సి దోహదం

* గ్రూప్ కమాండర్ కల్నల్ కె.వి.శ్రీనివాసరావు
* జవహర్ నవోదయాలో ప్రత్యేక జాతీయ సమన్వయ శిబిరం 
* 12 రోజులపాటు కార్యక్రమాలు
* వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఎన్.సి.సి క్యాడెట్లు

UPDATED 13th OCTOBER 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): దేశ సమగ్రత, క్రమశిక్షణకు ఎన్.సి.సి ఎంతగానో దోహదపడుతుందని కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ కె.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు 12 రోజుల పాటు ఎన్.సి.సి ప్రత్యేక జాతీయ సమన్వయ శిబిరాన్ని కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ కె.వి. శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు పొందడానికి ఎన్.సి.సి ఒక మార్గదర్శకమని అన్నారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి 300 మంది ఎన్.సి.సి క్యాడెట్లు, 12 మంది అసోసియేట్ ఎన్.సి.సి అధికారులు ఈ క్యాంపుకు హాజరయ్యారని,  వీరిలో 180 బాలురు, 120 మంది విన్ గర్ల్ పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు ఎన్.సి.సిలో కూడా ప్రతిభను చూపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ క్యాంపులు నిర్వహించి వారిని ఉత్తేజపరుస్తున్నాయని అన్నారు. ఎన్.సి.సి ద్వారా విద్యార్థుల్లో మానసిక వికాసం, శారీరక దృఢత్వం, నైపుణ్యం అభివృద్ధి, తదితర అంశాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ క్యాంపులో ప్రతీరోజు యోగా, వ్యాయామం, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన, సేవా కార్యక్రమాలు, వ్యాసరచన, వ్యక్తృత్వం, వ్యక్తిత్వ పోటీలతో పాటు, గ్రూప్ సంభాషణలు, రాష్ట్రాల యొక్క నైసర్గిక స్వరూపం, తదితర అంశాలపై చర్చాగోష్ఠి, ఫిజికల్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, వెపన్స్ ట్రైనింగ్, స్వచ్ఛ భారత్ అవగాహనా ర్యాలీలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ సంవత్సరం ఈ శిభిరం ఎన్.సి.సి డైరక్టరేట్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) ఆధ్వర్యంలో ఎన్.సి.సి.గ్రూప్ (కాకినాడ) ద్వారా నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు. 18 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ సింగ్  క్యాంపు డిప్యూటీ కమాండర్‌గా, 19 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ లీలాధర్ క్యాంపు ఆఫీసర్ ఇంఛార్జ్ ట్రైనర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం. సతీష్, అధిక సంఖ్యలో  క్యాడెట్లు, తదితరులు పాల్గొన్నారు.   

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us