UPDATED 22nd NOVEMBER 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలోని ఆదిత్య ఫార్మసీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సహకారంతో నవంబర్ 23, 24 తేదీలలో మోడరన్ టెక్నాలజీస్ ఇన్ డ్రగ్ డిజైన్ డవలప్ మెంట్ అండ్ ఎవాల్యూయేషన్ అనే అంశంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వై. సురేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, అతిధులుగా క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్, విశిష్ట అతిధిగా ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.వి. నారాయణ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదుకు చెందిన నైపర్ డీన్ & విభాగాధిపతి డాక్టర్ నళినీశాస్త్రి, ఎన్ఐటి(వరంగల్) ప్రొఫెసర్ & విభాగాధిపతి డాక్టర్ పి. ఓంకార పెరుమాళ్, మైలాన్ ల్యాబ్ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ డి. రాఘవేంద్ర, సన్ ఫార్మా అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ ఎం. రాజ్ కుమార్ వంటి నిష్ణాతులచే చర్చాగోష్ఠులు, పేపర్ ప్రజంటేషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఫార్మసీ కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.







