UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ఆత్మా పథకం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర విజ్ఞాన యాత్రకు బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీకి తరలి వెళ్లారు. కృషి ఉన్నతి మేళా 2018 కి జిల్లా నుంచి సుమారు 26 మంది రైతులతో కూడిన బృందం బయలుదేరి ట్రైన్ లో వెళ్లారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, పూసా న్యూఢిల్లీలో మార్చి 16 నుండి 18 వరకు ఈ కృషి ఉన్నతి మేళా జరుగుతుందని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మ కాకినాడ ఆధ్వర్యంలో వివిధ బ్లాకుల నుంచి జ్యోతిసాహి రైతులను ఎంపిక చేశారు. దీనిలో భాగంగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు, వివిధ పంటల ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సమీకృత వ్యవసాయ విధానాలు మొదలగు వాటిపై అవగాహన కల్పించుకుని తిరిగి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ నాగాచారి, జి.సునీత, తదితరులు పాల్గొన్నారు.







