పంచాక్షరీ మంత్రంతో మార్మోగిన సామర్లకోట

UPDATED 19th NOVEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామక్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమారారామ భీమశ్వరస్వామి ఆలయం పంచాక్షరీ మంత్రంతో మార్మోగింది. కార్తీక మాసం రెండవ సోమవారం, ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జాము నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఉన్న అశ్వత్థ శంకరనారాయణ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us