భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు వివాహ కానుక అందజేత

UPDATED 20th JANUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు వివాహ కానుకగా రూ.40 వేలను ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్ లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా పట్టణ జై భీం భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు చెంగల నూకరాజు అధ్యక్షతన స్థానిక అల్లూరి సీతారామరాజు పార్కు వద్ద ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు, కార్మిక శాఖ ద్వారా ఈ వివాహ కానుకలు మంజూరయ్యాయని అన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు అమలులో జాప్యం జరుగుతోందని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు వయసుతో నిమిత్తం లేకుండా రూ.మూడు వేలు పింఛన్ అమలు చేయాలని, అలాగే కార్మిక శాఖలో పెండింగ్ లో ఉన్న పనులను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న టూల్ కిట్లు ప్రతీ కార్మికుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే  కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్లు జాప్యం లేకుండా అధికారులు చూడాలని పేర్కొన్నారు. అనంతరం సంఘంలో సభ్యుడైన పిట్టా పద్మరాజు కుమార్తెలు సునీత, సుజాతలకు ఒక్కొక్కరికీ రూ. ఇరవై వేలు చొప్పున వివాహ కానుకలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కానేటి చినరాజు, కార్యదర్శి పిట్టా దుర్గబాబు, కోశాధికారి కుక్కల తాతబాబు, మహిళా నాయకులు అమ్మాజీ, రాయి వెంకటలక్ష్మి, డి. లోవరాజు, పిట్టా అప్పారావు, ఏ. అప్పారావు, నాగబాబు, చింతల సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us