UPDATED 2nd JANUARY 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో ఇటీవలే మృతి చెందిన వీరమరెడ్డి వసంత రాయుడు కుటుంబాన్ని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దొరబాబు వెంట సానుభూతి తెలిపిన వారిలో దవులూరి సుబ్బారావు, కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, పప్పుల వీరబాబు, కరణం సత్తిబాబు, ప్రసన్న, కరణం భాను, తదితరులు ఉన్నారు.







